హుజురాబాద్ లోనే ఈటల మకాం... తెల్లవారుజామునే రంగంలోకి

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

First Published Jun 30, 2021, 11:04 AM IST | Last Updated Jun 30, 2021, 11:04 AM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఆయన బిజెపిలో చేరినతర్వాత ఈ వేడి తారాస్థాయికి చేరింది. త్వరలో జరగనున్న ఉపఎన్నిక కోసం అటు అధికార టీఆర్ఎస్, ఇటు బిజెపి ఇప్పటినుండే సంసిద్దమవుతున్నాయి.  

ఇప్పటికే హుజురాబాద్ లోనే మకాం వేసిన ఈటల రాజేందర్ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ(బుధవారం) ఉదయం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ ను కలిశారు ఈటల. వాకర్స్ తో కలిసిపోయి వాకింగ్ చేస్తూనే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మైదానంలోని సమస్యలను త్వరలోనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ఈటల వాకర్స్ కు హామీ ఇచ్చారు.