సిరిసిల్ల జిల్లాలో దారుణం... హత్య కేసులో నిందితుడి దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన బాలనర్సు(43) ఓ హత్య కేసులో నిందితుడిగా వున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. ముస్తాబాద్ మండలం కొండాపూర్ కు చెందిన బాలనర్సు(43) ఓ హత్య కేసులో నిందితుడిగా వున్నాడు. అతడు గత రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ వద్ద మద్యం సేవిస్తుండగా ఇద్దరు యువకులు ఒక్కసారిగా దాడికి దిగారు. మద్యంమత్తులో అతడు కిందపడిపోవడంతో ఓ బండరాయిని తీసుకొచ్చిన యువకులు అతడి తలపై వేసి అత్యంత దారుణంగా హతమార్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడివున్న బాలనర్సు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలోనే బాలనర్సును యువకులు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.