మహిళ కడుపులో కత్తి మరిచిన డాక్టర్లు ... ఆరేళ్ల తర్వాత బయటపడ్డ అసలునిజం
పెద్దపల్లి : ఓ డాక్టర్ నిర్వాకం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది.
పెద్దపల్లి : ఓ డాక్టర్ నిర్వాకం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కత్తిని కడుపులోనే పెట్టి కుట్లేయగా ఏళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది ఓ మహిళ. ఇటీవల ఈ నొప్పి మరీ ఎక్కువ కావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోగా అసలునిజం బయటపడింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగుచూసింది.
ఆరేళ్ల క్రితం మంచిర్యాలకు చెందిన మహిళ గోదావరిఖనిలో ప్రసవం చేయించుకుంది. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులోనే కత్తిపెట్టి మరిచిపోయారు. దీంతో సదరు మహిళ ఏళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. అయితే ఆమె కడుపునొప్పి రోజురోజుకు మరింత ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. వైద్య పరీక్షలు చేయించగా కడుపులో కత్తి వున్నట్లు బయటపడింది.