కావాలంటే కాలితో తన్నండి బాంచన్... కడుపుపై కొట్టకండి : ధర్మపురి వీఆర్ఏ వీడియో వైరల్
ధర్మపురి : తనపై కక్షతో డిప్యూటి తహసీల్దార్ వేధింపులకు దిగుతున్నాడంటూ ఓ వీఆర్ఏ ఆత్మహత్యకు సిద్దమయ్యాడు.
ధర్మపురి : తనపై కక్షతో డిప్యూటి తహసీల్దార్ వేధింపులకు దిగుతున్నాడంటూ ఓ వీఆర్ఏ ఆత్మహత్యకు సిద్దమయ్యాడు. సారూ... నేను తహసీల్దార్ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో రికార్డ్ చేసాడు వీఆర్ఏ. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ధర్మపురి మండలం ధోనూరు వీఆర్ఏ గా విద్యాసాగర్ పనిచేస్తున్నాడు. అయితే ధర్మపురి మండల డిప్యూటీ తహసీల్దార్ గణేష్ తనపై కక్ష పెంచుకుని జీతం రాకుండా చేస్తున్నాడని వీఆర్ఏ ఆరోపించాడు. దీంతో సంక్రాంతి పండగపూట భార్యాబిడ్డలను పస్తులు వుంచాల్సి వచ్చిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. కాలితో తన్నండి బాంచన్... కడుపుపై కొట్టకండి అంటూ వీడియో, ఆడియో రికార్డ్ చేసాడు వీఆర్ఏ విద్యాసాగర్. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.