వైకుంఠధామం నిర్మించలేదని.. దళిత మహిళా సర్పంచ్ సస్పెన్షన్...

తాను ఒక దళిత మహిళ సర్పంచ్ అయ్యినందుననే తనని సస్పెండ్ చేసారని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published Nov 21, 2020, 4:28 PM IST | Last Updated Nov 21, 2020, 4:28 PM IST

తాను ఒక దళిత మహిళ సర్పంచ్ అయ్యినందుననే తనని సస్పెండ్ చేసారని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సస్పెన్షన్ కి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకరే కారణమని ఆరోపించారు. తమ సర్పంచ్ కి న్యాయం చేయాలని, సస్పెన్షన్ ని వెంటనే ఎత్తి వేయాలని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రెండు వందల మంది మహిళలు కలెక్టరేట్ కార్యాలయం  బైఠాయించారు. సుమారు గంటపాటు ఎమ్మెల్యే మరియు కలెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.