కరెంట్ కట్... చిమ్మచీకట్లోనే రామగుండం కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం మంగళవారం జరిగింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం మంగళవారం జరిగింది. అయితే మేయర్ అనిల్ కుమార్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు జనరేటర్లు కూడా మొరాయించాయి. దీంతో బడ్జెట్ ప్రసంగాన్ని సెల్ ఫోన్ల టార్చ్ లైట్ వెలుతురులోనే కానిచ్చేశారు రామగుండం మేయర్. ఈ చీకట్లోనే నగరంలో 2,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాబోతోందని మేయర్ ప్రకటన చేయడం గమనార్హం. బడ్జెట్ సమావేశం కావడంతో సభ్యులు మేయర్ చదివి వినిపించిన అంకెలను వింటూ తమ చేతిలోని ఎజెండా కాపీలను మొబైల్ లైట్ల సాయంతో చూస్తూ కార్పోరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. పాలకవర్గం, అధికారులు ఇబ్బందులు పడుతూ సమావేశం కొనసాగించారే తప్ప ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేసుకోకపోవడం అందరినీ ఆశ్చార్యానికి గురిచేసింది.