Asianet News TeluguAsianet News Telugu

112 ఏళ్ల తర్వాత హైదరాబాదులో రంజాన్ ఇలా...

రంజాన్ పర్వదినాన కళకళలాడే హైదరాబాద్ నగరం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది బోసిపోయింది. 

రంజాన్ పర్వదినాన కళకళలాడే హైదరాబాద్ నగరం కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది బోసిపోయింది. కరోనామహమ్మారి కారణంగా ఈ యేడు ముస్లింలు సామూహిక ప్రార్థనలకు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని రీతిలో ముస్లింలు రంజాన్ పర్వదినాన ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో హైదరాబాద్ నగరంలో రంజాన్ నాడు సందడి లేకుండా పోయింది. 112 ఏళ్ల క్రితం మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అప్పట్లో మసీదులు తెరిచి ఉంచినప్పటికీ.. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు కోవిడ్ విజృంభణతో ఇళ్లలోనే ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకొంటున్నారు.