Asianet News TeluguAsianet News Telugu

ఉమ్మడి కరీంనగర్ జిల్లా: తొలి కరోనా టీకా ఈమెకే...

రీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మొదటి టీకాను ‍ ఫ్రంట్ లైన్ ‌వారియర్ కి అందించారు మంత్రి గంగుల కమలాకర్.

రీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మొదటి టీకాను ‍ ఫ్రంట్ లైన్ ‌వారియర్ కి అందించారు మంత్రి గంగుల కమలాకర్. మొదటి టీకాను‌ జిల్లా ప్రధాన వైద్యశాల సూపరిండెంట్ రత్నమాల వేయించుకున్నారు. టీకా పై అవగాహన కల్పించడం కోసమే  మొదటి టీకాను వేయించుకున్నమన్నారు సూపరిండెంట్ రత్నమాల. 

కోవిడ్-19 పారదోలడానికి వ్యాక్సిన్ తొ పాటు భౌతిక దూరం, శానిటేషన్, మాస్ తప్పనిసరి అని అన్నారు వారంలో నాలుగు రోజులపాటు  అందుబాటులో ఉంచుతామని... అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న వారు 60 సంవత్సరాల పై బడిన వారికి‌ బాలింతలకు‌ టీకా కు‌ అనర్హులు‌ అని తెలిపారు. బీపి షుగర్ లాంటి సమస్యలు‌ ఉన్నా టీకా ‌ వేయించుకోవచ్చునని చెప్పారు. 

వారంలో నాలుగు రోజులపాటు  అందుబాటులో కోవిడ్ టీకా అందుబాటులో ఉంటుంది.ఎలాంటి అనుమానాలు లేకుండా వచ్చి టీకా వేయించుకోవచ్చునని రత్నమాల అన్నారు. టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ భౌతిక దూరం శానిటైజర్ మాస్కు తప్పని సరిగా ధరించాలని సూచించారు. 

కరీంనగర్ లో వ్యాక్సిన్ టీకామంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్  శశాంక. సీపి కమలాసన్ రెడ్డి ప్రారంభించారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 14 కేంద్రాల్లో 420 మందికి టీకాలు. ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సినేషన్ చేసేలా ఏర్పాట్లు చేసిన అధికారులు.

* 18 నుంచి 99 కేంద్రాల్లో రోజుకు వంద మంది చొప్పున టీకాలు.

* తొలి విడతలో 26,876 ఫ్ర0ట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్.

* ఉమ్మడి కరీంనగర్ జిల్లా కు 27,409 వాయిల్స్ కేటాయింపు.

* ఇప్పటి వరకు జిల్లా కు చేరుకున్న 6 వందల వాయిల్స్.

కరీంనగర్ -04
పెద్ధపల్లి-04
సిరిసిల్ల- 04 
జగిత్యాల 02 మొత్తం 14   కేంద్రాల్లో టీకాలు.

తొలి విడత లో 
కరీంనగర్ - 12,419 మందికి
పెద్ధపల్లి - 6,860
జగిత్యాల - 4,115
సిరిసిల్ల- 3,482  మొత్తం 26,876  మందికి తొలి విడత లో టీకాలు.