దుబాయ్ నుండి యూకే మీదుగా.. జగిత్యాల జిల్లాలో కరోనా స్ట్రెయిన్ కలకలం
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఇటివలే దుబాయ్ నుండి వచ్చిన ఓ వ్యక్తి నుండి గత నెల 25న శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. తాజాగా అతడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారులు అతడి కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయగా భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడు దుబాయ్ నుంచి యూకే మీదుగా వచ్చాడు. యూకేలో కరోనా సెకండ్ స్ట్రెయిన్ వుంది కాబట్టి అక్కడ ఏమయినా కరోనా సోకిందా అన్న అనుమానాన్ని వైద్యసిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్తగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినవారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడితో సన్నిహితంగా ఉన్న వారిని కరోనా పరీక్షలు చేసుకోవాలని, క్యారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.