ఐసోలేషన్ వార్డ్ నుండి పరారైన కరోనా పాజిటివ్ వ్యక్తి.. మరో వ్యక్తితో ప్రత్యక్షం..

రాజన్న సిరిసిల్లలోని జిల్లా ప్రధాన ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డ్ నుండి కరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోవడం కలకలం రేపింది.

First Published Jul 21, 2020, 12:22 PM IST | Last Updated Jul 21, 2020, 12:22 PM IST

రాజన్న సిరిసిల్లలోని జిల్లా ప్రధాన ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డ్ నుండి కరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోవడం కలకలం రేపింది. వేములవాడ మండలానికి చెందిన ఓ వ్యక్తిని గత రాత్రి జిల్లా ప్రదాన ఆసుపత్రికి వైద్యాధికారులు తరలించారు. అయితే కరోనా వార్డులో ఉంచిన ఆ వ్యక్తి ఉదయం కనపడపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుందరయ్య నగరులో ఆ వ్యక్తిని, అతనితో పాటు అగ్రహారానికి చెందిన మరొక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని తిరిగి ఐసోలేషన్ కు తరలించారు. అయితే  అంబుల్లెన్స్ వచ్చేవరకు వారికి కావాల్సిన భోజనం, మంచినీటిని పోలీసులే దగ్గరుండి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.