కరోనా ఎఫెక్ట్.. ఖాళీ అవుతున్న హైదరాబాద్...
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాలతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది.
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారాలతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం వలసొచ్చిన వారంతా తిరిగి సొంతూళ్ల బాట పట్టారు. పూర్తిగా స్థిరపడిన వారు మాత్రమే ఉండటానికి మొగ్గు చూపుతుండగా.. అద్దె ఇళ్లలో ఉంటూ.. ఆదాయం కోల్పోయిన వారు నగరంలో ఖర్చులు భరించలేకపోతున్నారు. సొంతూరు వెళ్తే ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చనే ఉద్దేశంతో నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో టు-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.