కరీంనగర్: సాయం చేద్దామని వచ్చి కానిస్టేబుల్ మృతి
కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద కరీంనగర్-హైదరాబాద్ రహదారిపై మానేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద కరీంనగర్-హైదరాబాద్ రహదారిపై మానేరు వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వంతెన పైనుంచి కారు అదుపుతప్పి కిందకు పడిపోవడంతో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అయితే బ్రిడ్జిపై నుంచి కారును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తూ చంద్రశేఖర్ అనే కానిస్టేబుల్ నదిలో పడిపోయాడు. తీవ్రగాయాల పాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన 1990 బ్యాచ్ ఉద్యోగిగా గుర్తించారు.