ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తత... పోలీసులతో యూత్ కాంగ్రెస్ నేతల వాగ్వాదం, అరెస్టులు

హైదరాబాద్ :ఏఐసిసి పిలుపు మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుండి రాజ్ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు.

First Published Mar 15, 2023, 4:57 PM IST | Last Updated Mar 15, 2023, 4:57 PM IST

హైదరాబాద్ :ఏఐసిసి పిలుపు మేరకు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుండి రాజ్ భవన్ కు భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీకి ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రభుత్వ రంగ సంస్ధలకు మోదీ సర్కార్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల అదానీ షేర్ల కుంభకోణంతో ప్రజా సంపద ఆవిరైందని... దీనిపై వెంటనే జెపిసి (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) తో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.ఇందులో భాగంగా సిఎల్సీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో రాజ్ భవన్ కు ర్యాలీగా వెళుతున్న నాయకులను ఖైరతాబాద్ వద్ద అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.  

పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ వరకు చేరకుండా పోలీసులు అడ్డుకోగలిగారు. 

Must See