కాలువల్లోనే ఇంత నాసిరకం అయితే.. డ్యామ్ ల పరిస్థితి ఏంటో.. ఉత్తమ్

కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లే కాలువ కూడా తెగిందని పనుల్లో ఇంత నాసిరకం కేసీఆర్ కు సిగ్గనిపిస్తలేదా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు. 

First Published Jul 1, 2020, 5:05 PM IST | Last Updated Jul 1, 2020, 5:05 PM IST

కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లే కాలువ కూడా తెగిందని పనుల్లో ఇంత నాసిరకం కేసీఆర్ కు సిగ్గనిపిస్తలేదా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గండిపడ్డ కొండపోచమ్మ సాగర్  కాలువను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. చిన్న కాలువ విషయంలోనే ఇంత నాసిరకం అయితే కాళేశ్వరం డ్యామ్ పరిస్థితి ఏంటో అని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ కింద ఉన్న కాలువలు యేండ్ల కిందట కట్టిన మట్టి కాలువలని అవి ఇప్పటికి ఒక్కసారి కూడా గండిపడలేదన్నారు. ఇవి సిమెంట్ కాలువలు కట్టి నెలకూడా కాకముందే ఎలా గండిపడతాయని ప్రశ్నించారు.