కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే.. కొత్త సెక్రటేరియట్ అవసరమా?.. పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత ఎందుకని టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రశ్నించారు. 

First Published Jul 7, 2020, 2:14 PM IST | Last Updated Jul 7, 2020, 2:14 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత ఎందుకని టీపీసీసీ నేత పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో ప్రశ్నించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని ఈ సమయంలో కొత్త సచివాలయం అవసరమా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్తితులుంటే సీఎం కేసార్ కనీసం వైద్యంపైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడో చీకటిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలనిసూచించారు. ఒకవైపు రాష్ట్రంలో రోజుకు 2000 కేసులు వస్తుంటే, కరోనాపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారని whereiskcr# అని ప్రజలంతా ఒకవైపు అడుగుతుంటే, మరోవైపు సెక్రటేరియట్ కూల్చివేతను ప్రారంభించారని మండిపడ్డారు.