చచ్చాక భీమా కాదు... బ్రతికుండగానే నేత బంధు ఇవ్వాలి..: మాజీ ఎంపీ పొన్నం డిమాండ్
సిరిసిల్ల : నేతన్నలపై కేసీఆర్ సర్కార్ కు నిజంగానే చిత్తశుద్ది వుంటే వారు చనిపోయాక భీమా డబ్బులు ఇవ్వడం కాదు బ్రతికుండాగానే నేత బంధు పేరిట ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు. పొన్నం సూచించారు.
సిరిసిల్ల : నేతన్నలపై కేసీఆర్ సర్కార్ కు నిజంగానే చిత్తశుద్ది వుంటే వారు చనిపోయాక భీమా డబ్బులు ఇవ్వడం కాదు బ్రతికుండాగానే నేత బంధు పేరిట ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసారు. బతుకమ్మ చీరల గురించి కాదు సిరిసిల్ల టెక్స్ టైల్ లో వున్న క్లస్టర్లు మూతపడటం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ హయాంలో ప్రతి మహిళా సంఘానికి రూ.5 లక్షల రుణమిచ్చి ఆదుకున్నామని... అలాగే నేతన్నలనూ ఆదుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు పొన్నం ప్రభాకర్.
టీఆర్ఎస్ పార్టీ వేములవాడకు జర్మనీ ఆయనను, సిరిసిల్ల కు సిద్దిపేట ఆయనను ఎమ్మెల్యేలుగా, కరీంనగర్ కు వరంగల్ ఆయనను ఎంపీగా చేసిందని పొన్నం పేర్కొన్నారు. మాజీ ఎంపీగా, ఇప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్ సిరిసిల్లకు ఏం చేశాడో ప్రెస్ క్లబ్ వేదిక గా బహిరంగ చర్చకు సిద్దమా? అని పొన్నం సవాల్ విసిరారు. స్థానికేతరులు కావడంతో వీరికి స్థానిక ప్రజలతో పాలనాపరమైన సంబంధాలు లేవని, అందుకే ప్రజల యోగక్షేమాలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయం గురించి కరీంనగర్ ప్రజలు ఆలోచన చేయాలని మాజీ ఎంపీ పొన్నం సూచించారు.