ప్రగతి భవన్ లో నేషనల్ పాలిటిక్స్... సీఎంలు, మాజీ సీఎం, జాతీయ నేతలతో కేసీఆర్

హైదరాబాద్ : నలుగురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ సీఎం, పలువురు జాతీయ నాయకులు ముఖ్య అతిథితులుగా భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

First Published Jan 18, 2023, 2:29 PM IST | Last Updated Jan 18, 2023, 2:29 PM IST

హైదరాబాద్ : నలుగురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ సీఎం, పలువురు జాతీయ నాయకులు ముఖ్య అతిథితులుగా భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్, పినరయి విజయన్ తో పాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సిపిఐ నేత డి రాజా కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. ప్రగతి భవన్ కు చేరుకున్న నాయకులందరికి స్వయంగా కేసీఆర్ పుష్ఫగుచ్చం, శాలువాతో సత్కరించారు. అనంతరం నాయకులందరితో కలిసి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు తెలంగాణ సీఎం కేసీఆర్.