తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ వుమెన్స్ డే కానుకలు : హరీష్ కీలక ప్రకటన
కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు కేసీఆర్ సర్కార్ అద్భుతమైన మూడు కానుకలు అందజేస్తోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ పేర్కొన్నారు.
కరీంనగర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు కేసీఆర్ సర్కార్ అద్భుతమైన మూడు కానుకలు అందజేస్తోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ పేర్కొన్నారు. తెలంగాణ అక్క చెల్లెల్ల అనారోగ్య సమస్యల పరిష్కారానికి 'ఆరోగ్య మహిళ' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇక రెండోది న్యూట్రీషన్ కిట్... ఇప్పటికే పలు జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించగా శ్రీరామనవమి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని హరీష్ తెలిపారు. ఇక మూడోది మహిళలకు రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు... ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేసి మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు హరీష్ వెల్లడించారు.
కరీంనగర్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సహచర మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ప్రారంభించారు హరీష్ రావు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న హరీష్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.