Asianet News TeluguAsianet News Telugu

Russia Ukraine Crisis: తెలంగాణ వరుడు- ఉక్రెయిన్ వధువు... హైదరాబాద్ లో వైభవంగా వివాహం

హైదరాబాద్: రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. బాంబుల దాడి, తుపాకుల మోతలతో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది.

హైదరాబాద్: రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. బాంబుల దాడి, తుపాకుల మోతలతో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలతో పాటు ఉన్నతచదువులు, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ విపత్కర సమయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రతీక్ ఉక్రెయిన్ అమ్మాయి లిబోవ్ ను వివాహమాడాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహానికి హాజరైన చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన పూజారి రంగరాజన్ వధూవరులను ఆశీర్వదించడమే కాదు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దవాతావరణ తొలగి శాంతి నెలకొనాలని కోరుకున్నారు.