బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్..బిడ్డాలెందారే కోల్..(వీడియో)

బతుకమ్మకు ముందుగా చేసుకునే పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ తల్లుల పండుగ అయితే బొడ్డెమ్మ పిల్లల పండుగ. బతుకమ్మ పూల పండుగ అయితే బొడ్డెమ్మ పుట్టమన్నుతో చేసే సింగారం..కన్నెపిల్లల పండుగ.

First Published Sep 27, 2019, 11:39 AM IST | Last Updated Sep 27, 2019, 11:39 AM IST

బతుకమ్మకు ముందుగా చేసుకునే పండుగ బొడ్డెమ్మ. బతుకమ్మ తల్లుల పండుగ అయితే బొడ్డెమ్మ పిల్లల పండుగ. బతుకమ్మ పూల పండుగ అయితే బొడ్డెమ్మ పుట్టమన్నుతో చేసే సింగారం..కన్నెపిల్లల పండుగ.బోణి అంటే స్త్రీ..బోణి ప్లస్ అమ్మ బోణెమ్మ..అదే వాడుకలో బొడ్డెమ్మగా మారింది. ఈ పండుగను బాద్రపద బహుళ పాడ్యమి మొదలు పంచమిలోపు అనుకూలమైన మంచిరోజు రేగటి మట్టి లేదా పుట్టమన్నుతో వేస్తారు.చెక్కపీటతో శ్రీ చక్రం వేసి దాని మీద గుండ్రంగా లేదా నలుచదరంగా ఐదుఅంత్రాలుగా బొడ్డమ్మను పేరుస్తారు. ఇప్పుడు చెక్క బొడ్డెమ్మలు కూడా వాడుకలో ఉన్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ రోజు ఉదయం బొడ్డెమ్మను నిమజ్జనం చేసిన తరువాతే బతుకమ్మ పేర్చడం మొదలుపెడతారు.