ఒకరి పాప మరొకరికి... ఆరోగ్య మంత్రి ఇలాకాలో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్వాకం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లీలలు రోజుకు ఒక్కటి వెలుగు చూస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి లీలలు రోజుకు ఒక్కటి వెలుగు చూస్తున్నాయి. రెండు రోజుల క్రితం సెలైన్ బాటిల్ తో డాక్టర్ కారు కడిగిన విషయం మరువక ముందే తాజాగా ఒకరికి డెలివరీ అయిన పాపను మరొకరికి అప్పగించిన ఘటన బయటపడింది. అయితే పాప అసలు పేరెంట్స్ నిలదీయగా తప్పును గుర్తించి తిరిగి వారి పాపను వాళ్లకు అప్పగించారు. ఆసుపత్రిలో రోజుకో వివాదం వెలుగు చూస్తుండడంతో సిబ్బంది తీరుపై విమర్షలు వెల్లువెత్తుతున్నాయి.