మంత్రి కొప్పుల ఈశ్వర్ నాకు అన్యాయం చేసాడు... పెట్రోల్ డబ్బాతో తెరాస నేత హల్చల్

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో  మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు....

First Published Feb 20, 2022, 9:09 PM IST | Last Updated Feb 20, 2022, 9:09 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లో  మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు....మంత్రి,ఎమ్మెల్యే లు వచ్చే క్రమంలో మాజీ సింగిల్ విండో ఛైర్మన్ అడువాల సురేష్ పెట్రోల్ డబ్బా చేతిలో పట్టుకొని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు....తాను తెలంగాణ ఉద్యమం ముందున్నాని,మండలం లో టిఆర్ఎస్ కి మొట్టమొదటి కార్యకర్తనని,కాని తాను సింగిల్ విండో ఎన్నికలలో అధ్యక్షుడు కాకుండా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్  5 లక్షలకి అమ్ముకున్నాడని పెట్రోల్ డబ్బాతో రోడ్డుపై పడుకొని నిరసన తెలిపాడు