Asianet News TeluguAsianet News Telugu

మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సిబిఐ అధికారులు...

కరీంనగర్ : ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేయగా ఇవాళ సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు వెళ్లడం కలకలం రేపింది.  

First Published Nov 30, 2022, 1:07 PM IST | Last Updated Nov 30, 2022, 1:07 PM IST

కరీంనగర్ : ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేయగా ఇవాళ సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు వెళ్లడం కలకలం రేపింది.  కరీంనగర్ లోని మంత్రి ఇంటికి వేరే కేసు విషయంలో నోటీసులు అందించేందుకు సిబిఐ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐపిఎస్ అధికారి పేరిట మోసాలకు పాల్పడుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని సిబిఐ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసారు. అతడు గంగులతో కలిసున్న ఫోటోలు అధికారులకు చిక్కడంతో విచారణ కోసమే మంత్రికి నోటీసులు అందించినట్లు సమాచారం. రేపు డిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సిబిఐ అధికారులు ఇంటికివచ్చిన సమయంలో మంత్రి గంగుల లేకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు నోటీసులు అందుకున్నారు.