చిన్నారులతో కలిసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆటలు... గిల్లీదండా ఆడుతూ సందడి

కరీంనగర్ : గతంలో సంక్రాంతి పండగ అంటే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, హరిదాసుల సందడితో పాటు చిన్నారుల ఆటాపాటలతో గ్రామాల్లో సందడి వాతావరణం వుండేది. 

First Published Jan 16, 2023, 11:38 AM IST | Last Updated Jan 16, 2023, 11:38 AM IST

కరీంనగర్ : గతంలో సంక్రాంతి పండగ అంటే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, హరిదాసుల సందడితో పాటు చిన్నారుల ఆటాపాటలతో గ్రామాల్లో సందడి వాతావరణం వుండేది. కానీ ప్రస్తుతం మారిన కాలంతో పాటే పండగ చేసుకునే తీరుకూడా మారింది. ఈ క్రమంలో తన చిన్ననాటి  జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గిల్లీ దండ ఆడుతూ సందడిచేసారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. సంక్రాంతి పర్వదినాన చిన్నపిల్లాడిలా మారిన ఎమ్మెల్యే చిన్నారుల్లో జోష్ నింపారు.  కోడీమ్యాల మండలం తీర్మాలపూర్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొని గిల్లీ దండా ఆడారు.