కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఎంపీ సోయం బాపూరావు సందడి...

సిరిసిల్ల : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఎంపీ సోయం బాపూరావు సందడి చేసారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

First Published Oct 17, 2022, 10:58 AM IST | Last Updated Oct 17, 2022, 10:58 AM IST

సిరిసిల్ల : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఎంపీ సోయం బాపూరావు సందడి చేసారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ప్రారంభించగా అందులో ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటుచేసారు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆద్వర్యంలో సిరిసిల్లలో ఏర్పాటుచేసిన ఈ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ ఎంపి బాపూరావు ప్రారంభించారు