కేసీఆర్ బిఆర్ఎస్ కాదు అంతరిక్ష పార్టీ పెట్టినా... దాంతో సమానమే: ఎంపీ అరవింద్

 జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేసారు. 

First Published Oct 11, 2022, 5:05 PM IST | Last Updated Oct 11, 2022, 5:05 PM IST

 జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై నిజామాబాద్ ఎంపీ దర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేసారు. కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి కాదు అంతరిక్ష పార్టీ పెట్టినా లిల్లీపుట్ తో సమానమని అన్నాడు. మునుగోడులోనే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి విజయం ఖాయమని... టీఆర్ఎస్  చిత్తుచిత్తుగా ఓడిపోతుందని అరవింద్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు నాయుడు తిరుపతిరెడ్డి ని ఎంపీ అరవింద్ ఇవాళ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... డిల్లీ లిక్కర్ పాలసీని కవిత బినామీలే రూపొందించారని అన్నారు. ఇది చాలు లిక్కర్ స్కాం కవిత చేసిందేనని చెప్పడానికి అని ఎంపీ అరవింద్ ఆరోపించారు.