ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించిన బండి సంజయ్.. సీఎంపై మండిపాటు
బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రామచంద్రరావులతో కలిసి ఈ రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, రామచంద్రరావులతో కలిసి ఈ రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బ్లాక్ జలమయం అయిన సంగతి తెలిసిందే. నీటిలోనే పేషంట్లు, సిబ్బం, ది ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బండి సంజయ్ హెరిటేజ్ బ్లాక్ ను సందర్శించి అక్కడి వసతి సౌకర్యాలు, రోగుల స్థితిగతులు, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.