బిజెపి ఎమ్మెల్యే ఈటలతో మంత్రి మల్లారెడ్డి ... అసలేం జరుగుతోంది?

మేడ్చల్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఏం చేసినా రాజకీయ దుమారమే.

First Published Feb 20, 2023, 10:09 AM IST | Last Updated Feb 20, 2023, 10:09 AM IST

మేడ్చల్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఏం చేసినా రాజకీయ దుమారమే. ఆయన ఒక్కోసారి మాటలతో, మరికొన్నిసార్లు తన వ్యవహార తీరుతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా తాజాగా బిజెపి ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో కలిసి వేదిక పంచుకుని కొత్త రాజకీయ చర్చకు తెరతీసారు. ఇటీవల మల్లారెడ్డితో పాటు కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన నాటినుండి ఆస్తులు కాపాడుకునేందుకు మల్లారెడ్డి బిజెపిలో చేరనున్నారంటూ ఓ ప్రచారం జోరందుకుంది. ఇటీవల మేడ్చల్ జిల్లాకు చెందిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం మల్లారెడ్డికి వ్యతిరేకంగా సమావేశమవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. తాజాగా బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. మేడ్చల్ జిల్లా దేవరయాంజన్ లో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజున ప్రారంభించారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించగా బిజెపి ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ తో పాటు జిల్లా మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఈటలతో మల్లారెడ్డి తనదైన స్టైల్లో సరదాగా మాట్లాడుతూ నవ్వులు పూయించారు. ఇలా బిజెపి ఎమ్మెల్యేలతో మల్లారెడ్డి సరదా ముచ్చట్లు సీరియస్ రాజకీయ చర్చకు దారితీసాయి.