వేములవాడ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో అపచారం... బిజెపి ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించి అపచారం చేశారంటూ బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వతం మౌఢ్యం బిగించి అపచారం చేశారంటూ బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు. ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన బోర్డుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భాలయ ప్రవేశం నిషేధం ఉన్న సమయంలో ఎలా బిగించారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే దీనిపై తమకు సమాచారం లేదని స్థానాచార్యులు చెబుతున్నారు.