బిజెపి మీటింగ్ లో ఇంటెలిజెన్స్ అధికారి... స్ట్రాగ్ వార్నింగ్ ఇచ్చిన రాణిరుద్రమ
సిరిసిల్ల : బిజెపి కార్యక్రమాలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడంపై తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
సిరిసిల్ల : బిజెపి కార్యక్రమాలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడంపై తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సిరిసిల్లలో జరిగి బిజెపి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నవారి ఫోటోలు తీస్తూ అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తిని రాణిరుద్రమ నిలదీసారు. దీంతో అతడు తనపేరు రవీందర్ రెడ్డి అని... ఇంటెలిజెన్స్ అధికారినంటూ సమాధానమిచ్చాడు. ఎవరెవరు బిజెపి కార్యక్రమానికి వచ్చారు... ఎవరెవరి పేర్లు గవర్నమెంట్ కు పంపించాలని చూస్తున్నారా? అంటూ అతడిపై రాణిరుద్రమ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులను ప్రతిపక్షాల సభలవద్ద మొహరించడమేనా కేటీఆర్ సంస్కారం అంటూ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు రానివారిని, నిరుద్యోగులను, గవర్నమెంటోళ్ల దందాలను, లిక్కర్ షాపులను ఫోటోలు తీసి ప్రభుత్వానికి పంపించాలని సదరు ఇంటెలిజెన్స్ అధికారికి రాణిరుద్రమ సూచించారు.