సన్నాసుల్లారా... దమ్ముంటే బయటకురండి..: టీఆర్ఎస్ నేతలపై డికె అరుణ ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ నాయకుల జీతగాళ్ళలా వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ నాయకుల జీతగాళ్ళలా వ్యవహరిస్తున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు. ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వం మీకు జీతాలిస్తోంది... సీఎం కేసీఆరో, టీఆర్ఎస్ పార్టీయో జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తించాలన్నారు. ఎమ్మెల్యేల అడుగులకు మడుగులు వత్తే బ్రతుకులు ఓ బ్రతుకులేనా అని మండిపడ్డారు.
యూనిఫాం వేసుకుని బెదిరిస్తే ప్రజలు భయపడిపోరు... ఊర్లల్లకు కూడా అడుగుపెట్టనివ్వకుండా తిరగబడతారని హెచ్చరించారు.
ఇక టీఆర్ఎస్ నాయకులపైనా డికె అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సన్నాసుల్లారా... దమ్ము దైర్యం వుంటే బయటకురాండి. దద్దమ్మల్లా పోలీసులను ముందు పెట్టుకుని రాజకీయాలు, డ్రామాలు వద్దంటూ డికె అరుణ హెచ్చరించారు.