బిజెపి నేత ఆత్మహత్యయత్నం
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన సొల్లు అజయ్ వర్మ అనే బిజెపి నేత తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన సొల్లు అజయ్ వర్మ అనే బిజెపి నేత తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి బండి సంజయ్ నీ అధిష్టానం తప్పించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని అనుచరులు తెలిపారు. చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.