బండి సంజయ్ నే పిలువరా : భగ్గుమన్న బిజెపి కార్పోరేటర్లు
కరీంనగర్ లో జరిగిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం రసాభసాగా మారింది.
కరీంనగర్ లో జరిగిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం రసాభసాగా మారింది. కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ ను కార్యక్రమానికి పిలవలేదని బిజెపి కార్పోరేటర్లు వాకౌట్ చేశారు. ఈ విషయాన్ని, ఫ్లెక్సీ విషయంలో ఫోటో కాల్ పాటించలేదన్న విషయాన్ని బిజెపి కార్పొరేటర్ అడగగా మంత్రి గంగుల కమలాకర్ దాటవేసే సమాధానం చెప్పారు. దీనికి నిరసనగా బిజెపి కార్పొరేటర్లు వాకౌట్ చేస్తే వెళ్ళండి అనడంతో అక్కడే కూర్చొని ధర్నా చేస్తున్న బిజెపి కార్పొరేటర్లు. కలెక్టర్ వివరణ ఇచ్చేంతవరకూ ధర్నా కొనసాగిస్తామని అన్నారు.