సొంత ఇలాకాలో... మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. గతంలో కేటిఆర్ ఇచ్చిన మాట ప్రకారం మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని బీజేపీ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ వాహనాన్ని అడ్డుకుని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.