బిజెపి పవర్ లోకి రాగానే... ఆ లుచ్చాల ఇళ్లపైకి బుల్డోజర్లు :బండి సంజయ్ సంచలనం
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో కఠినంగా వుంటోందని...
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో కఠినంగా వుంటోందని... అందుకు ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కార్ చర్యలే నిదర్శనమన్నారు. యూపీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దుర్మార్గుల ఇళ్లను బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు... రేపు తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ఇలాగే చేస్తామన్నారు. మహిళవైపు కన్నేత్తి చూసే లుచ్చా నా కొడుకుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి కూల్చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం ఎస్టీ మహిళకు దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి పదవినిచ్చి గౌరవిస్తే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మాత్రం ఉన్నతవిద్యావంతురాలైన ఓ ఎస్టీ మహిళలను చితిమీద పేర్చిన ధౌర్భాగ్య పరిస్థితి తెచ్చిందన్నారు సంజయ్. ఇదే ముఖ్యమంత్రి గతంలో మహిళల వైపు చూస్తే కళ్లు పీకేస్తా, కాళ్లు పీకేస్తా అన్నాడు... కానీ అవన్నీ మాటలకే పరిమితమయ్యాయని అన్నారు.తెలంగాణ మహిళల రక్షణ కోసం బిజెపి పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ తెలిపారు.