కరీంనగర్ లో ఉద్రిక్తత... బిజెపి, బిఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలు

కరీంనగర్ : ఇవాళ(గురువారం) కరీంనగర్ తీగలగుట్ట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

First Published Jul 13, 2023, 4:43 PM IST | Last Updated Jul 13, 2023, 4:43 PM IST

కరీంనగర్ : ఇవాళ(గురువారం) కరీంనగర్ తీగలగుట్ట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ శంకుస్థాపన చేసారు. అయితే కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి స్థానిక బిజెపి ఎంపీ బండి సంజయ్ ను ఆహ్వానించకపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిజెపి,బిఆర్ఎస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో శంకుస్థాపన ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ...  ఆర్వోబి నిర్మాణం ఎవరి ఫండ్స్ తో జరుగుతుందని ముఖ్యం కాదు... ప్రజల సమస్య తీరడమే ముఖ్యమన్నారు. రూ.154 కోట్లతో ఆర్వోబి నిర్మాణం జరుగుతుందని... సంవత్సరం లోగా దీన్ని పూర్తిచేస్తామని అన్నారు. రైల్వే గేట్ పడిన ప్రతిసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని...  ఆర్వోబి కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అని మంత్రి గంగుల పేర్కొన్నారు.