Chicken: తెలంగాణలో కోళ్లకు బర్డ్ ఫ్లూ.. చనిపోయిన వాటిని ఏం చేయాలంటే? | Asianet News Telugu
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటి శాంపిల్స్ సేకరించి.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపి పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని ఫారాల్లో కోళ్లను క్వారంటైన్ చేశారు. ప్రభావిత కోళ్ల ఫారాలకు కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించి... పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కోళ్ల ఫారాల నిర్వాహకులకు వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పశుసంవర్ధక శాఖ & మత్స్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.