ఎమ్మెల్యేగారూ కంగ్రాట్స్.. అనుకున్నది సాధించారు.. : తన రాజీనామాపై భోగ శ్రావణి

జగిత్యాల జిల్లా : మాజీ మున్సిపల్ చైర్మన్  భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వనికి, వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు. 

First Published Feb 24, 2023, 10:54 AM IST | Last Updated Feb 24, 2023, 10:54 AM IST

జగిత్యాల జిల్లా : మాజీ మున్సిపల్ చైర్మన్  భోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వనికి, వార్డ్ కౌన్సిలర్ కు రాజీనామా చేశారు. బాధాతప్త హృదయం తోనే తాను బిఆర్ఎస్ పార్టీని వీడవలసి వస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావని తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల 25న మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బోగ శ్రావని గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, 37 వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను బీఫామ్ ఇవ్వడం వల్లే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యిందంటూ ఎమ్మెల్యే మాట్లాడడాన్ని భోగ శ్రావణి తప్పు పట్టారు. తాను ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యానని తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారిని, పార్టీలో ఉన్న కవితక్క మనుషులను కుట్రపూరితంగా పార్టీకి దూరం చేయాలని అనుకుంటున్న ఎమ్మెల్యే  విజయం సాధించారని, అనుకున్నది సాధించిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు అని తెలిపారు.