భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి రండి...: దేవాదాయ మంత్రికి అర్చకుల ఆహ్వానం
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆలయ అధికారులు, అర్చకులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు.
భద్రాచలం: భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆలయ అధికారులు, అర్చకులు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్ కు విచ్చేసిన భద్రాచలం ఆలయ అధికారులు, అర్చకులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్బంగానే ఏప్రిల్ 10న జరగనున్న స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, వాల్ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. మిథిల ప్రాంగంణంలో జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారని... వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.