కేసిఆర్ కు ఆంధ్రోళ్ళు పెండ బిర్యాని తినిపించాలి..: బండి సంజయ్
హైదరాబాద్ : వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సీఎం కేసీఆర్ తీరు వుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేసారు.
హైదరాబాద్ : వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సీఎం కేసీఆర్ తీరు వుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేసారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి ఆంధ్రోళ్లను అవమానించి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ ఆంధ్రొళ్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఆంధ్రోళ్ల వంటకాల గురించి అవమానకరంగా మాట్లాడుతూ పెండ బిర్యాని, ఉలవచారు పశువుల కుడితి అన్న కేసీఆర్ కు ఇప్పుడు అదే బిర్యాని తినిపించాలని బండి సంజయ్ అన్నారు. బిఆర్ఎస్ అంటూ కేసీఆర్ నంగచాచి మాటలు మాట్లాడుతున్నాడు... అసలు బీఆర్ఎస్ కు జాతీయాధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడే లేని పార్టీకి రాష్ట్ర అధ్యక్షున్ని ఎలా ప్రకటిస్తారో అర్థం కావడం లేదన్నారు. సొంత రాష్ట్రంలో అధ్యక్షున్ని ప్రకటించకుండా పక్క రాష్ట్రంలో ప్రకటించారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఇవ్వకుంటే ఆంధ్రా, తెలంగాణ వేరువేరా... వాటిలిస్తూ మనంమనం ఒకటేనా అని అంటారని బండి సంజయ్ పేర్కొన్నారు.