గౌరవెల్లి నిర్వాసితులను పరామర్శించిన బండి సంజయ్... కన్నీటీపర్యంతమైన బాధిత మహిళలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలు పరిహారం కోసం ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే.

First Published Jun 15, 2022, 10:07 AM IST | Last Updated Jun 15, 2022, 10:07 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలు పరిహారం కోసం ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. ఇలా గుడాటిపల్లిలో ఆందోళనకు దిగిన నిర్వాసితులపై ఇటీవల పోలీసులు లాఠీచార్జ్ చేసారు. ఈ లాఠీచార్జ్ గాయపడిన నిర్వాసితులను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.  
గుడాటిపల్లిలో నిర్వాసితులు నిరసన చేపట్టిన టెంట్ వద్దకు చేరుకున్న సంజయ్ గాయపడినవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళలు కన్నీటిపర్యంతం అవుతూ తమ ఆవేదనను ఆయనకు తెలిపారు. పోలీసుల దెబ్బను తాళలేకపోయామంటూ ఒంటిపై అయిన గాయాలను బండి సంజయ్ కు చూపించారు నిర్వాసితులు. నిర్వాసితుల టెంట్ వద్ద కూర్చుని బాధితుల సమస్యలను విన్నారు బండి సంజయ్.