మా పంటలను కాపాడండి..: తెలంగాణ అధికారులకు వైసిపి ఎమ్మెల్యే ఫోన్
సాగునీరు అందజేసి ఎన్ఎస్పీ జోన్ -౹౹ ఎడమ కాలువ ఆయకట్టు రైతులను వెంటనే ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు.
సాగునీరు అందజేసి ఎన్ఎస్పీ జోన్ -౹౹ ఎడమ కాలువ ఆయకట్టు రైతులను వెంటనే ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు.
జగ్గయ్యపేట మండలం గండ్రాయి మేజర్ కాలువ వద్ద నుండి పెనుగంచిప్రోలు వరకు గల ఎన్ఎస్పీ కాలువను నీటిపారుదల శాఖ అధికారులు, రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్ఎస్పీ జోన్ - ౹౹ ఎడమ కాలువకు ప్రతియేటా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. కానీ ప్రస్తుతం కేవలం 450 క్యూసెక్కుల సాగునీటి ని మాత్రమే విడుదల చేస్తున్నారని, దాని వల్ల సుమారుగా 40వేల ఎకరాల వరి, మొక్కజొన్న, మిర్చి రైతులు నీటి ఎద్దడి తో నష్టపోతున్నారన్నారని అన్నారు. వెంటనే ఖమ్మం జిల్లా నీటిపారుదల శాఖ సీఈ, ఎస్ఈ లతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఫోన్ లో మాట్లాడి రైతులకు సాగునీటికి కావాల్సిన 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరడం జరిగింది.
దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఉదయ భాను తెలిపారు.