గన్ సెల్యూట్ల మధ్య ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు
దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 16 బీహార్ రెజిమెంట్ కి చెందిన సైనికులు తమ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలను చూసుకున్నారు. సంతోష్ బాబు తండ్రి ఉపేందర్ చితికి నిప్పంటించారు. జోహార్ సంతోష్ బాబు నినాదాలతో కేసారంలోని సంతోష్ కుమార్ వ్యవసాయ క్షేత్రం మార్మోగింది.