96ఏళ్ల వయసులో కరోనా వ్యాక్సిన్... ఆదర్శంగా నిలిచిన వరమ్మ
కరీంనగర్: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నా వ్యాక్సిన్ తీసుకోడానికి మాత్రం ప్రజలు భయపడుతున్నారు.
కరీంనగర్: ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్నా వ్యాక్సిన్ తీసుకోడానికి మాత్రం ప్రజలు భయపడుతున్నారు. వ్యాక్సిన్ పై పలు రకాల అనుమానాలతో ప్రజలు ముందుకు రావడం లేదు. ఇలాంటిది వ్యాక్సిన్ అనుమానాలను పటాపంచలు చేయడానికి ఓ 96ఏళ్ళ వృద్ధురాలు ముందుకు కదిలారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన వాక్సిన్ కేంద్రంలో 96ఏళ్ల వృద్ధురాలు వెన్నంపల్లి వరమ్మ టీకా తీసుకున్నారు. ఈ వయసులోనూ ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన వృద్ధురాలు వరమ్మకు జమ్మికుంట తహశీల్దార్ నారాయణ శాలువాతో సన్మానించారు.