కరోనా నిర్దారణ... టెస్టింగ్ సెంటర్లోనే కుప్పకూలి వృద్ధుడు మృతి
కరోనా టెస్టుల కోసం వచ్చిన ఓ వ్యక్తి టెస్ట్ కాగానే కుప్పకూలి మృతిచెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
కరోనా టెస్టుల కోసం వచ్చిన ఓ వ్యక్తి టెస్ట్ కాగానే కుప్పకూలి మృతిచెందిన విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన రేగోడి చంద్రయ్య(70) కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో ఇవాళ ధర్మపురి సామాజిక ఆరోగ్యకేంద్రంలో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురయిన అతడు అక్కడే ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. కోవిడ్ నిబంధనల మేరకు చంద్రయ్య మృతదేహాన్ని వైద్యసిబ్బంది భద్రపరిచారు.