వేములవాడ రాజన్న ఆలయం వద్ద 21 రోజుల బాలుడి అపహరణ..
రాజన్నసిరిసిల్ల జిల్లా : వేములవాడ రాజన్న ఆలయం వద్ద బాలుడి అపహరణ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు 21 రోజుల బాబును అపహరించారు. వేములవాడ రాజన్న ఆలయం మెట్ల దగ్గర నాలుగు రోజులుగా కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య ఉంటుంది. కారణాలు తెలియవు కానీ ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఆలయం మెట్ల వద్ద లావణ్య ఒంటరిగా ఉంటుంది.ఇది గమనించిన వ్యక్తులు ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి, వేకువజామున చిన్నారిని అపహరించినట్లు గా సమాచారం. ఉదయం మెలుకువ వచ్చిన తరువాత బాబు లేకపోవడంతో జరిగిన ఘోరం లావణ్యకు అర్థమయ్యింది. వెంటనే బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.