అద్భుతం.. సింగరేణి బొగ్గుగనిలో పురాతన ఏనుగు దంతాలు...

రామగుండం సింగరేణి ఓసిపి 4లో అరుదైన ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సుమారు రెండు వేల యేళ్లనాటి ఏనుగు దంతలుగా పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు. 

First Published Jul 7, 2020, 1:32 PM IST | Last Updated Jul 7, 2020, 1:32 PM IST

రామగుండం సింగరేణి ఓసిపి 4లో అరుదైన ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. సుమారు రెండు వేల యేళ్లనాటి ఏనుగు దంతలుగా పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే రామగుండం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు నిల్వలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరికి బొగ్గు నిల్వలు పూర్తిగా తీయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో గనిలో తవ్వకాలు చేపట్టగా ఈ రోజు ఏనుగు దంతాలను పోలిన అవశేషాలు బయటపడ్డాయి. దీంతో కార్మికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు పురావస్తు అధికార్లను సంప్రదించారు.  దంతాలు దొరికిన చోట పరీక్షలు నిర్వహించారు. సింగరేణి పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. సుమారు 2000 ఏళ్ల క్రితం అడవి ప్రాంతంలో ఏనుగు సంచరించిందా లేక ఎవరైనా ఇక్కడ పాతి పెట్టారా అనే కోణం లో విచారణ చేస్తున్నారు.