జగిత్యాలలో కరోనా కలకలం... సోషల్ వెల్పేర్ హాస్టల్లో 17మంది బాలికలకు పాజిటివ్

జగిత్యాల జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేగింది. 

First Published Mar 19, 2021, 5:06 PM IST | Last Updated Mar 19, 2021, 5:06 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేగింది. పట్టణంలోని బాలికల సోషల్ వెల్పేర్ హాస్టల్ లో వుంటూ చదువుకుంటున్న 230 మంది విద్యార్థిణుల్లో కొందరు రెండు రోజులుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధ పడుతున్నారు. ఇలాంటి 31 మంది విద్యార్థునిలకి పరీక్షలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మిగతా విద్యార్థులు,సిబ్బంది, ఉపాధ్యాయులకి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్థులకి మరో భవనంలో క్వారంటైన్ చేశారు. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.