కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డు: 11 మోటార్లతో గోదావరి వాటర్ లిఫ్ట్
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఒకేసారి 11 మోటార్లను రన్ చేసి నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజ్ లోకి ఎత్తిపోస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ 21న మోటార్లను నిలిపి వేసిన అధికారులు మెడిగడ్డ బ్యారేజి గేట్లను మూసివేసి వృధాగా పోతున్న గోదావరి నీటిని ఒక్కొక్క బొట్టుగా ఒడిసిపట్టి నీటిని పెద్దమొత్తంలో నిల్వ చేశారు.