రేవంత్ రెడ్డి ఫెయిల్: తెలంగాణ బిజెపి గేమ్ ప్లాన్ ఇదీ...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత చూపించిన దూకుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూపించడం లేదు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత చూపించిన దూకుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూపించడం లేదు. అంతర్గత కుమ్ములాటలో ఆయన దూకుడు తగ్గించినట్లు కనిపిస్తోంది. Congressకు జవజీవాలు పోయడానికి Revanth Reddy కృషి ఫలించే సూచనలు కనిపించడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపించింది. అదే సమయంలో Eatela Rajender విజయం తర్వాత తెలంగాణ బిజెపి దూకుడు పెంచింది. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదుర్కోవడానికి Telangana BJP వ్యూహరచన చేసి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ తెలంగాణ బిజెపి విస్తరణకు ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.